Wednesday, March 12, 2025
Homeజిల్లాలుఅనంతపురంప్రభుత్వ ఆసుపత్రిలోనే గర్భిణీలకు సురక్షితమైన ప్రసవం

ప్రభుత్వ ఆసుపత్రిలోనే గర్భిణీలకు సురక్షితమైన ప్రసవం

డాక్టర్ తరుణ్ సాయి

అనంతపురం జిల్లా
విశాలాంధ్ర – శెట్టూరు : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గర్భిణీలకు ప్రసవం సురక్షితము అని డాక్టర్ తరుణ్ సాయి పేర్కొన్నారు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సోమవారం జరిగిన గర్భవతులకు క్లినిక్ డే సందర్భంగా గర్భవతులకు వివిధ రకాలైన పరీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భవతులకు పలు సూచనలు, సలహాలు తెలియజేశారు, ప్రతిరోజు సమతుల్యమైన ఆహారం తీసుకుంటేనే కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని, గర్భవతులకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే సురక్షితమైన ప్రసవం జరుగుతుంది అని, ప్రైవేట్ హాస్పిటల్లో గర్భవతులకు భయభ్రాంతులకు గురిచేసి సాధారణ ప్రసవాన్ని కూడా సిజేరియన్ చేయాలని వేలకు వేలు డబ్బులు గుంజుతున్నారు అని తెలియజేశారు్న ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లీలావతి,ల్యాబ్ టెక్నీషియన్ మంజునాథ్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మౌనిక, అఖిల, ఇంద్రజ ఆశ కార్యకర్తలు వివిధ గ్రామాల గర్భవతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు