Wednesday, March 12, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅంగన్వాడి వర్కర్స్, హెల్పర్ల సమస్యలను పరిష్కరించండి..

అంగన్వాడి వర్కర్స్, హెల్పర్ల సమస్యలను పరిష్కరించండి..

సిఐటియు నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కార్మికుల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలను గైకొనాలని కోరుతూ ఆర్డిఓ మహేష్ కు వినతి పత్రాన్ని సిఐటియు నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా తొలుత పట్టణంలోని పలు కూడలిల ద్వారా వందల సంఖ్యలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఐటియు మండల కన్వీనర్ జే వి రమణ, కో కన్వీనర్ అయూబ్ ఖాన్, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కార్యదర్శి చంద్రకళ మాట్లాడుతూ సుప్రీం కోర్టు తెలిపిన ప్రకారం కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని తీర్పు ఇస్తే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేకపోవడం దారుణము కాదా అని వారు ప్రశ్నించారు. పేరుకు మాత్రమే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రభుత్వ ఉద్యోగాలుగా చెబుతూ అధికంగా పనులు చేయించడం జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, మినీ వర్కర్లు, మెయిన్ వర్కర్లుగా జీవోలు విడుదల చేస్తామని గ్రాజువిటీ పెంచుతామని గత ప్రభుత్వం ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అమలు చేస్తామని చెప్పడం జరిగిందని అది ఇంతవరకు అమలు కాక లేకపోవడం బాధాకరమన్నారు. కార్మికుల పైన విపరీతమైన పని భారం పడుతోందని అతి తక్కువ వేతనం ఇస్తూ పనిచేయడం సరి అయిన పద్ధతి కాదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని దాదాపుగా మూడు సంవత్సరాలుగా టీఏ బిల్లులు, సిబి ఈవెంట్స్ బిల్లులు, పెండింగ్లో ఉన్నాయని మెనూ చార్జీలు పెంచి, ఉచితంగా గ్యాస్ ఇవ్వాలని ఇంటి అద్దెలను పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకురాలు పోతక్క, దీన ,సునీత ,ఫాతిమా, చింతమ్మ, అరుణ, లక్ష్మీదేవి, గోవిందమ్మ, వేదవతి, గంగరత్న ,చిట్టెమ్మ, ప్రాజెక్టు పరిధిలోని వర్కర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు