Wednesday, March 12, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రజల సమస్యలు తీర్చడానికే ప్రజా సమస్యల పరిష్కార వేదిక లక్ష్యం..ఆర్డీవో మహేష్

ప్రజల సమస్యలు తీర్చడానికే ప్రజా సమస్యల పరిష్కార వేదిక లక్ష్యం..ఆర్డీవో మహేష్

విశాలాంధ్ర ధర్మవరం;; ప్రజల సమస్యలు తీర్చడానికే ప్రజా సమస్యల పరిష్కార వేదిక లక్ష్యము అని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో సమావేశ భవనంలో ధర్మవరం రెవెన్యూ డివిజన్ లోని ఏడు మండలాల ప్రజల సమస్యల కొరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికను (పి జి ఆర్ ఎస్) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రతి సోమవారం ఆర్డిఓ కార్యాలయ సమావేశ భవనంలో ఏడు మండలాల ప్రజల వివిధ సమస్యల పరిష్కారానికి తాము అన్ని విభాగాల అధికారులు ఇక్కడే అందుబాటులో ఉంటారని, ఏ సమస్యకు సంబంధించినటువంటి అంశమైన, అక్కడికక్కడే పరిష్కరించబడేటట్లు ప్రయత్నం చేస్తామని, లేనియెడల షెడ్యూల్ తేదీలలో తప్పక పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పీజీఆర్ఎస్ ను అభివృద్ధి బాటలో నడిపేందుకే వివిధ మండల అధికారులు, సిబ్బంది తమ విధులను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఆయా మండలాలలో పరిష్కరించబడని సమస్యలను కూడా తగిన రీతిలో విచారణ జరిపి పరిష్కరించేందుకు విశేషంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. మొత్తం 15 దరఖాస్తులు డివిజన్ వారిగా రావడం జరిగిందని, ఇందులో సబ్ డివిజన్ రద్దుకు 01, భూ తగాదాలు 4, రస్తా వివాదం 01, సర్వే సమస్యలు 01, భూమి సమభాగాల సమస్యలు 01, ఇంటి పట్టా 01, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ సొసైటీ హౌస్ సైట్ కావాలన్నా సమస్య 01, సిబిఆర్ గా 02, ఆఫ్లైన్లో 02 విరసి మొత్తం 15 దరఖాస్తులు రావడం జరిగిందని వారు తెలిపారు. ఈ దరఖాస్తుల ద్వారా విచారణ జరిపి ఆయా మండల అర్జీదారులకు న్యాయం తప్పక చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల వివిధ ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు