Wednesday, March 12, 2025
Homeజిల్లాలునెల్లూరుకళవల్ల లో పొలంపిలుస్తుంది కార్యక్రమం

కళవల్ల లో పొలంపిలుస్తుంది కార్యక్రమం

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని కళవల్ల గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయాధికారి ఎం. హేమంత్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కందుకూరు వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు పి అనసూయ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సహాయ వ్యవసాయ సంచాలకులు అనసూయ మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రతి రైతుకి ఒక ప్రత్యేక విశిష్ట సంఖ్య(యూనిక్ నెంబర్)ఇవ్వడం ద్వారా వ్యవసాయాన్ని సులభతరం చేసి పారదర్శకంగా సేవలను అందించడం కోసం చేయబడుతున్న బృహ హత్కరమైన రైతు ప్రత్యేక విశిష్ట సంఖ్య (యూనిక్ నెంబర్)నమోదు కార్యక్రమం అని తెలియజేసారు, కావున రైతులు మీ సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి రైతు ఆధార కార్డు,పట్టాదారు పాసు పుస్తకాలు, మొబైల్ నెంబర్ తీసుకొని ప్రత్యేక పోర్టల్ లో అన్ని వివరాలు నమోదు చేసుకొన్ని తర్వాత ఒక ప్రత్యేక విశిష్ట సంఖ్య పొందవచ్చునని, తద్వారా రాబోయే రోజుల్లో వ్యవసాయ శాఖ ద్వారా వచ్చే వివిధ రకాల పథకాలు,రాయితీలు, పి ఎం కిసాన్,అన్నదాత సుఖీభవ, యంత్ర పరికరాలు, పంటల బీమా, పెట్టుబడి రాయితీలు, తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం రైతులతో కలిసి శనగ పంట పొలాలను పరిశీలించడం జరిగింది ప్రస్తుతం శనగ పంట కాయ దశలో ఉన్నది ఈ దశలో ఎకరాకు 13-0-45 ఒక కేజీ తృప్పు తెగులు ఆశించకుండా ఉండటానికి హెక్సా కొనజాల్ 400ఎంఎల్ మరియు ఇండక్సోకార్బ్ 200 ఎల్ ఎల్ పిచ్చికారి చేసుకోవాలని సూచించారు.
పశుసంవర్ధక సహాయకులు మాట్లాడుతూ గేదలు ఉన్న ప్రతి రైతు కూడా పశు బీమా చేయించుకోవలసినదిగా తెలియజేశారు ఒక గేదకు 30 వేల రూపాయలు ఇన్సూరెన్స్ కు ప్రీమియం 1920 రూపాయలు దీనిలో ప్రభుత్వం సబ్సిడీ 1536రూపాయలు రైతు చెల్లించవలసింది 398రూపాయలు మాత్రమే కావున రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పశు బీమా కొరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు పి శ్రీకాంత్ రెడ్డి మరియు పశుసంవర్ధక సహాయకులు రఫిక్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు