Wednesday, March 12, 2025
Homeజిల్లాలుకర్నూలుఅగ్ని ప్రమాద బాధితుడికి ఆర్థిక సహాయం

అగ్ని ప్రమాద బాధితుడికి ఆర్థిక సహాయం

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని దొడ్డిమేకల గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో గడ్డివాము దగ్ధం అయింది. ప్రమాద బాధితుడు ఎంపీటీసీ సభ్యులు మల్లేష్ కు మంగళవారం వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ లు 5వేలు చొప్పున 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి చేయూత ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువుల కోసం కొనుగోలు చేసుకున్న వరిగడ్డి వామి అగ్ని ప్రమాదంలో దగ్ధమయిందని, అగ్ని ప్రమాద బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పశువులకు పశుగ్రాసం కొనుగోలుకు వ్యవసాయ శాఖ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శివరామిరెడ్డి, బ్రహ్మయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు