Friday, March 14, 2025
Homeఅంతర్జాతీయంసిరియాలో మారణహోమం ఆక్షేపణీయం: కేకేఈ

సిరియాలో మారణహోమం ఆక్షేపణీయం: కేకేఈ

ఏథెన్స్‌ : సిరియాలో భద్రతా బలగాలకు, మాజీ అధ్యక్షుడు అసద్‌ మద్దతుదారులకు మధ్య భీకర పోరులో వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోవడంపై గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) ఆవేదన వ్యక్తంచేసింది. ఈ మారణహోమాన్ని ఖండిరచింది. జిహాదీల పాలనలో అలవైట్‌ల ఊచకోత జరుగుతోందని, అమెరికా, ఈయూ మద్దతుతో టర్కీ, ఇజ్రాయిల్‌ సహకారంలో జిహాదీ రాజ్యం ఇలాంటి హేయమైన నేరాలకు పాల్పడుతోందని మంగళవారం ఒక ప్రకటనలో ఆక్షేపించింది. మైనారిటీలే లక్ష్యంగా నేరాలు జరుగుతున్నాయని పేర్కొంది. సామ్రాజ్యవాద యుద్ధాలు… ప్రజల నెత్తిన తుపాకీ ఎక్కిపెట్టి సాధించే ‘శాంతి’ అన్నవి ఒకే నాణేనికి రెండు వైపులని మరోసారి రుజువైందని వ్యాఖ్యానించింది. పెట్టుబడిదారీ వర్గ కర్కశత్వం, ప్రపంచాన్ని భిన్నరీతిలో పంచుకోవడం వంటివి బాధాకరమైన పరిణామాలకు దారితీస్తున్నట్లు గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ ఆందోళన వ్యక్తంచేసింది. తాజా పరిణామాలకు జర్మన్‌ ప్రభుత్వ జోక్యం కూడా కారణమని దుయ్యబట్టింది. ఫిబ్రవరిలో సిరియా పర్యటన క్రమంలో సమ్మిళిత విధానాల నెపంతో రాజకీయ బదిలీ సజావుగా సాగుతుందని గ్రీస్‌ మంత్రి భ్రమలు కల్పించారని విమర్శించింది. ఇలాంటి పరిణామాలే రక్తపాతానికి దారితీశారని న్యూ డెమొక్రసీ ప్రభుత్వాన్ని కమ్యూనిస్టు పార్టీ ఆక్షేపించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు