Friday, May 3, 2024
Friday, May 3, 2024

సంబరాల్లో అపశృతి

గాలిలోకి కాల్పులు : 17 మంది మృతి
కాబూల్‌ : అఫ్గాన్‌లో పంజ్‌షీర్‌ను ఆక్రమించుకున్నామంటూ తాలిబన్లు చేసుకున్న సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. శుక్రవారం తాలిబన్లు గాలిలోకి అనేక మార్లు తుపాకులను పేల్చారు. ఈ ఘటనలో సుమారు 17 మంది చనిపోగా…41 మంది గాయపడినట్లు తాలిబన్‌ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ ప్రకటించారు. అల్లాకు కృతజ్ఞతలు తెలుపుతూ గాల్లోకి కాల్పులుజరపడమనేది ఒక సంప్రదాయమని అన్నారు. పంజ్‌షీర్‌ను వశం చేసుకున్నట్లు వార్తలు వెలువడగానే.. అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌కు తూర్పున ఉన్న నాన్ఘర్హ్‌ ప్రాంతంలో తాలిబన్‌లు గాల్లోకి కాల్పులు జరిపారని తెలిపారు. ఆగస్టు 31న అమెరికా బలగాలు ఉపసంహరించుకున్న సమయంలో కూడా తాలిబన్‌లు ఇదేవిధంగా గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ విధంగా గాల్లోకి కాల్పులు జరపడాన్ని నిలిపివేయాలని, ఇది అఫ్గాన్‌ పౌరులకు ప్రమాదకరంగా మారిందని ముజాహిద్‌ ట్వీట్‌ చేశారు. అనవసరంగా కాల్పులు జరపవద్దని హెచ్చరించారు. ఆఫ్ఘన్‌లో ఇంకా పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img