ఏ సమస్యనైనా మహిళలు దీటుగా ఎదుర్కోవాలి…
జిల్లా ఎస్పీ వి.రత్న ఐపీఎస్
విశాలాంధ్ర ధర్మవరం : మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, ఏ సమస్య వచ్చినా వాటిని దీటుగా ఎదుర్కోవాలని జిల్లా ఎస్పీ వి .రత్న ఐపిఎస్ తెలిపారు.ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం లో భాగంగా, ధర్మవరం సబ్ డివిజన్లోని సికేపల్లి లో టింబక్ కలెక్టివ్ వారి ఆధ్వర్యంలో మహిళా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఒక దేశం అభివృద్ధి చెందాలంటే మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం, దేశం ,రాష్ట్రం కుటుంబం అభివృద్ధి చెందుతుందన్నారు.
అందుకోసమే నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ మహిళా సంఘాలను ఏర్పాటు చేసి, వారికి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటున అందిస్తున్నారు.
మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని,పని చేసే చోట మహిళలు లైంగిక వేధింపులకు గురైతే
వారి కోసం లైంగిక వేధింపులు నివారించే చట్టాలు ఉన్నాయన్నారు. పనిచేసే చోట మహిళలు ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏ సమస్య అయినా మహిళలు దీటుగా ఎదుర్కొని ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.
మహిళలకు పోలీస్ శాఖ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు.
టింబక్టు కలెక్టివ్ వ్యవస్థాపకులు మేరీ మాట్లాడుతూ మహిళలు వివక్షతకు గురవుతున్నారు అని, లింగ సమానత్వం లేక అవకాశాలు కోల్పోతున్నారు కావున మహిళలందరూ ఏకమై లింగ సమానత్వం కోసం,సాధికారత కోసం పనిని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏడి సుకన్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లింగ సమానత్వం కోసం ప్రపంచ స్థాయిలో జరిగే విశ్లేషణలో ప్రధానంగా విద్య, ఆరోగ్యం, రాజకీయం, ఆర్థికపరమైన అంశాలను పురుషులతో పోల్చుకుని చూస్తారు ఇలా చూసినప్పుడు మన దేశంలో ఈ అంశాలలో మహిళలు చాలా వెనుకబడ్డారు అని తెలిపారు.ఈ అంతరాన్ని పూరించాలంటే కనీసం ఐదు తరాలు పడుతుందన్నారు. కావున లింగ సమానత్వం కోసం చర్యను వేగవంతం చేయడానికి మనమందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలి అని పిలుపునిచ్చారు.
ఇందులో టింబక్టు కలెక్టివ్ అన్ని కార్యక్రమాల నుండి మహిళా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొని ఆట,పాటలతోటి, సాంస్కృతిక కార్యక్రమాల తోటి ఉత్సాహంగా ఉల్లాసంగా ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్, రామగిరి సీఐ శ్రీధర్, అభ్యర్థన మహిళలు పాల్గొన్నారు.