Saturday, March 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రేషన్ స్వాధీనం..రూరల్ ఎస్సై శ్రీనివాసులు

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రేషన్ స్వాధీనం..రూరల్ ఎస్సై శ్రీనివాసులు

విశాలాంధ్ర ధర్మవరం:: హైదరాబాద్-బెంగళూరు హైవే నేషనల్ హైవే-44 రోడ్డు దగ్గర అనంతపురం నుండి పెనుకొండ వైపు అక్రమంగా తరలిస్తున్నటువంటి పిడిఎస్ రైసును ఆకస్మికంగా తనిఖీ తనిఖీలు బయటపడగా వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని రూరల్ ఎస్సై శ్రీనివాసులు సిఎస్డిటి సురేంద్ర తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రూరల్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది కలసి విశ్వసనీయమైన సమాచారం మేరకు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక బొలెరో వాహనమును పక్కకు ఆపి ఇద్దరు వ్యక్తులు పారిపోవుటకు ప్రయత్నం చేయగా తన సిబ్బందితో వారిని పట్టుకుని విచారించగా ఒకరి పేరు షేక్ బాబా రెండో వ్యక్తి పేరు వడ్డే అజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారించగా వారి ఊరు సోమందేపల్లి అని తెలపడం జరిగిందన్నారు. వీరు అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో పిడిఎస్ రైసును ప్రజల వద్ద నుండి 20 రూపాయలకు కొని 50 రూపాయలకు సోమందేపల్లి లోని హోటళ్లకు విక్రయిస్తున్నారని తెలిపారు. అక్రమంగా పిడిఎస్ రైసును అమ్ముట చట్టరీత్య నేరమని తెలిపి వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు