Saturday, March 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమూత్రపిండాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి..

మూత్రపిండాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి..

ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యులు, రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నర్సిములు
విశాలాంధ్ర ధర్మవరం; ప్రతి వ్యక్తి మూత్రపిండాల (కిడ్నీ) విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకొని చక్కటి ఆరోగ్యం పొందాలని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యులు డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోతుకుంట రోడ్డులో గల నూతన ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్లో ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా సందర్శించారు. వీరి వెంట ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి కూడా ఉన్నారు. అనంతరం అక్కడ డయాలసిస్ జరుగుతున్న పనులను వారు పరిశీలించారు. ఈ డయాలసిస్ కేంద్రంలో 22 మంది డయాలసిస్ చికిత్స పొందుతున్న రోగులను వారు ఆరోగ్య విషయంపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ బిపి షుగర్ వ్యాధిగ్రస్తులకే మూత్రపిండాల వ్యాధి అధికంగా వస్తుందని, ఈ రోగులకు రక్తనాళాలు దెబ్బ దెబ్బతిని మూత్రపిండాల ద్వారా వడపోత చేసిన తర్వాత శక్తిని తగ్గిస్తాయని తెలిపారు. మలినాలు రక్తములో ఉండటం వలన మూత్రపిండాలు పనిచేయవు అని తెలిపారు. వ్యాధి బాధితులు సక్రమ వైద్య చికిత్స అందుకొని అదుపులో ఉంచుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని తెలిపారు. ధర్మవరంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి డయాలసిస్ కేంద్రాన్ని నియోజకవర్గ ప్రజలకు ధర్మారం ఎమ్మెల్యే, ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఏర్పాటు చేయడం హర్షనీయమని, ప్రజలు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ప్రజలు కాళ్లు ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు అధికంగా మాత్రలను వాడరాదని, అలా వాడినప్పుడే కిడ్నీలు దెబ్బ తినే అవకాశం ఉంటుందని తెలిపారు, అంతేకాకుండా సిగరెట్టు త్రాగడం కూడా కిడ్నీ దెబ్బ తినే అవకాశం ఉంటుందని తెలిపారు. మానవ శరీరంలో కిడ్నీ అనేది ఒక ముఖ్యమైన భాగము అని తెలిపారు. మానవ శరీరంలో ఉత్పన్నమైన మలినాలను రక్తము ద్వారా మూత్రపిండములోకి చేరి వడగట్టపడుతుంది తదుపరి బయటికి వేరే రూపంలో పంపబడుతుందని తెలిపారు. తద్వారాన్ని రక్తం శుభ్రపడుతుందని తెలిపారు. కిడ్నీ పని విధానం సరిగా లేకపోతే వివిధ అనారోగ్యాలు వస్తాయి అని తెలిపారు. కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు నీరసము, బలహీనము, శరీరం ఉబ్బడం లాంటివి కిడ్నీ వ్యాధి లక్షణాలు అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డయాలసిస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు