Saturday, November 23, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యారంగ సమస్యల మీద 18న మహాధర్నా జయప్రదం చేయండి

విద్యారంగ సమస్యల మీద 18న మహాధర్నా జయప్రదం చేయండి

విశాలాంధ్ర పెనుకొండ ( శ్రీ సత్య సాయి జిల్లా) : పెండింగ్ లో ఉన్న విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు బడ్జెట్‌లో కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ, విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18న విజయవాడ ధర్నాచౌక్‌లో జరిగే మహాధర్నా జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి హర్షకుమార్ ,పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హర్షకుమార్ , మాట్లాడుతూ విద్యాదీవెన, వసతిదీవన బకాయిలు రూ.3,480కోట్ల విడుదలకు ప్రభుత్వం తాత్సర్యం చేస్తుందని అన్నారు. ఇప్పటికే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పలుమార్లు విన్నవించిన ప్రభుత్వం జాప్యం చేస్తూ కల్లబొల్లి మాటాలు చెప్తుందని వాపోయారు. అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్‌లో కేటాయింపులలో పెండింగ్ బకాయిల గురించి మాట్లాడకపోవడం హేయమైనచర్య. విద్యార్దులు ఫీజులు చెల్లించలేక పడరాని పాట్లు పడుతున్నారన్నారు. ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతులు ఇస్తామని యాజామాన్యాలు విద్యార్ధులపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్ధులకు రూ.12,600 కోట్లు కావాలి. కానీ రూ.5,387.03 కోట్లే బడ్జెట్‌లో కేటాయించారు. దీనితో తల్లికి వందనంపై ఉన్న అనుమానాలు పెరిగాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అమలుపై స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. జీఓ నెం:77ను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రద్దు చేస్తామని చెప్పి వాటి ఊసెత్తడంలేదన్నారు.
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిందని వెంటనే పున:ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. మెస్‌ చార్జీలు రోజుకి మెస్‌బిల్లు రూ.100కి పెంచి నెలకు రూ.3,000 ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. ఈ నెల 18న విజయవాడ ధర్నా చౌక్‌లో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు కదలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి హర్షకు మార్,సాయికృష్ణ, భరత్, ఫయాజ్, అజయ్,అనిల్,మంజు,మహేష్,చందు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు