Monday, April 7, 2025
Homeఆంధ్రప్రదేశ్వైఎస్సార్‌సీపీకి బిగ్ షాక్.. మరో ఎమ్మెల్సీ రాజీనామా, పార్టీకి గుడ్ బై

వైఎస్సార్‌సీపీకి బిగ్ షాక్.. మరో ఎమ్మెల్సీ రాజీనామా, పార్టీకి గుడ్ బై

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి దారుణమైన పరాజయం ఎదురైంది. ఆ పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమితం అయ్యింది.. కూటమి 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్‌సీపీకి వరుసగా నేతలు షాకిస్తున్నారు.. ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మరో నేత పార్టీని వీడియోరు. వైఎస్సార్‌సీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్‌ రాజీనామా చేశారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు వైఎస్సార్‌సీపీని వీడగా.. వారిలో పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ ఉన్నారు.మర్రి రాజశేఖర్ 2004 ఎన్నికల్లో అప్పటి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి.. ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. అనంతరం 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఓడిపోయారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం 2010లో మర్రి రాజశేఖర్ వైఎస్సార్‌సీపీలో చేరగా.. 2014లో చిలకలూరిపేట నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి మరోసారి టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజశేఖర్ ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.. ఆయన 2018లో వైఎస్‌ జగన్‌ చేసిన పాదయాత్రలో కీలకంగా వ్యవహరించారు. 2019లో మర్రి రాజశేఖర్‌కు నిరాశ తప్పలేదు.. ఆయనకు చిలకలూరిపేట టికెట్ దక్కలేదు.. విడదల రజినికి టికెట్ ఇవ్వగా గెలిచారు. అయితే మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని స్వయంగా వైఎస్ జగన్ ప్రకటించారు. కానీ ఆ హామీని తర్వాత నెరవేర్చలేదు.. చివరికి 2023 మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. అయితే మంత్రి పదవి మాత్రం దక్కలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మర్రి రాజశేఖర్ వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది.. ఆయన మాత్రం స్పందించలేదు. ఇప్పుడు తాజాగా మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ పదవితో పాటు వైఎస్సార్‌సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు