విశాలాంధ్ర- ధర్మవరం ; శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన రజినీ ట్రస్ట్ వ్యవస్థాపకులు కన్నా వెంకటేష్ కు డొక్కా సీతమ్మ జాతీయ పురస్కారములు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొన్నూరు కిరాణా అసోసియేషన్ కళ్యాణ మండపం నందు ఆదివారం మన పొన్నూరు బ్లడ్ అసోసియేషన్ 9వ వార్షికోత్సవం సందర్భంగా మన పొన్నూరు బ్లడ్ అసోసియేషన్ చైర్మన్ టి. ఉమా శంకర్ , ప్రముఖ కవి రచయిత రంగు శెట్టి రమేష్, ఉద్యోగ రాజకీయ విశ్లేషకులు చందు సాంబశివరావు, స్థానిక నాయకులు పార్వతి నాయుడుచేతుల మీదగా డొక్కా సీతమ్మ జాతీయ పురస్కారాలను అందుకోవటం జరిగింది అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. డొక్కా సీతమ్మ జాతీయ పురస్కారాల అవార్డు నన్ను ఎంపిక చేసిన మన పొన్నూరు బ్లడ్ అసోసియేషన్ చైర్మన్ తిరుమల శెట్టి ఉమాశంకర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం నిరంతరం తాను 5 సంవత్సరాల నుంచి ప్రజలకు ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు వచ్చిందని తెలిపారు. తనకు అవార్డు రావటం వలన మరింత బాధ్యతలు పెరిగిందని ,జాతీయ పురస్కారం రజనీ ట్రస్ట్ సభ్యులు రక్తబంధం ట్రస్ట్ సభ్యులు మా మిత్రులు శ్రేయోభిలాషులందరికీ ఈ అవార్డు అంకితమన్నారు. ఐదు సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ, ఎంతో మంది తలసేమియా చిన్నారులకు రక్తదానం చేస్తూ, నిరుపేద నిత్యవసర సరుకులు అత్యవసర సమయంలో ఆర్థిక సాయం అనేక సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ , ఆకలితో ఉన్న అభాగ్యులకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఇప్పటికీ కూడా నిరంతరం జరుగుతున్నదని తెలిపారు. ఈ అవార్డు పట్ల రజిని ట్రస్ట్, రక్త బంధం ట్రస్టు, శ్రేయోభిలాషులు, అభిమానులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, అధికారులు, అనధికారులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
రజిని ట్రస్ట్ రక్త బంధం ట్రస్ట్ వ్యవస్థాపకులు కన్నా వెంకటేష్ డొక్కా సీతమ్మ జాతీయ పురస్కారం
RELATED ARTICLES