విశాలాంధ్ర- తనకల్లు : మండల పరిధిలోని మొరాలపల్లిలో నూరు మీటర్ల సిమెంట్ రోడ్డు అవసరమని గుర్తించామని ఎంపీడీవో పూల నరసింహులు తెలిపారు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ మండల పర్యటన చేపట్టినప్పుడు మొరాలపల్లి గ్రామస్తులు సిమెంట్ రోడ్డు అవసరమని ఆయన దృష్టికి తీసుకుపోగా దీనిపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు ఆదేశానుసారం గ్రామానికి వెళ్లిన ఎంపీడీవో 100 మీటర్ల సిమెంట్ రోడ్డు అవసరమని గుర్తించారు నివేదికను తయారుచేసి పై అధికారులకు పంపుతున్నట్టు తెలిపారు. గ్రామంలో ప్రధాన సమస్య అయిన సిమెంట్ రోడ్డును చేపడుతున్నందుకు గ్రామస్తులు కూటమి ప్రభుత్వoతో పాటు శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.