Saturday, April 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅలరించిన నృత్యాంజలి కార్యక్రమ వేడుకలు..

అలరించిన నృత్యాంజలి కార్యక్రమ వేడుకలు..

నాట్య గురువు మానస
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణములోని కళా జ్యోతిలో మానస నృత్య కళా కేంద్రం వారి నృత్యంంజలి కార్యక్రమ వేడుకలు అందరిని అలరారించాయని నాట్య గురువు మానస తెలిపారు. ఈ సందర్భంగా కళాజ్యోతిలో నృత్యంజలి కార్యక్రమం ప్రేక్షకుల్ని, అభిమానుల్ని, కళాకారుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం గురువు మానస మాట్లాడుతూ స్వర్గీయ నృత్య శిరోమనులకు ఈ నృత్యాంజలి కార్యక్రమం అంకితం చేయడం జరిగిందన్నారు. ముఖ్య అతిథులుగా తోలుబొమ్మలాట చిత్ర కళాకారులు దలవాయి చలపతి, రచయిత అండ్ దర్శకులు మురళీధర్, టీవీ అండ్ సినీ నటులు ఆకళ్ళ గోపాలకృష్ణ, టీవీ అండ్ సినిమా నటులు అల్లరి అర్జున్, రంగస్థలం, సినిమా, బుల్లితెరల నటులు మల్లాది భాస్కర్, రంగస్థలం సకలవృత్తి కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆనంద్, అబ్బా టీవీ డాక్టర్ హరిప్రసాద్, వరల్డ్ లెదర్ పప్పెట్ అవార్డు గ్రహీత చిదంబర రావు, సాంస్కృతిక మండలి వ్యవస్థాపకులు సత్రశాల ప్రసన్న కుమార్, కళాజ్యోతి కార్యదర్శి పాలెం వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగిందన్నారు. 25 మంది చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి,భరతనాట్యం తదితర ప్రదర్శనలు అందరినీ మొగ్ధులు చేశాయన్నారు. ప్రతిభ కనబరిచిన అందరికీ కూడా ముఖ్య అతిథుల చేత అభినందన పత్రాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. తదుపరి మెమెంటోస్ పంపిణీ ద్వారా ఈ వేడుకలు ముగిశాయని వారు తెలిపారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే మానస చదువుతోపాటు నృత్యం అనే కళను ఆచరించి ఎంతోమందికి కళా విద్యను నేర్పడం గర్వించదగ్గ విషయమని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు