Monday, April 14, 2025
Homeఆంధ్రప్రదేశ్పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ..కోర్టు విధించిన షరతులు ఇవే...

పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ..కోర్టు విధించిన షరతులు ఇవే…

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు ఊరట కల్పించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో, ఆయన జైలు నుంచి విడుదలయ్యేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.

షరతులు :
రూ. 2 లక్షల విలువతో ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు ఇవ్వాలి.
జైలు నుంచి విడుదలైన తర్వాత దేశం విడిచి వెళ్లరాదు.
కేసు గురించి ఎక్కడా బహిరంగంగా మాట్లాడకూడదు. మీడియాతో కూడా మాట్లాడకూడదు.
పత్రికలకు ప్రకటనలు ఇవ్వరాదు.
నాలుగు వారాల పాటు ప్రతి మంగళ, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలి.
కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు