Saturday, April 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపరస్పర సహకారంతోనే ఉపాధి అవకాశాలు సాధ్యం..

పరస్పర సహకారంతోనే ఉపాధి అవకాశాలు సాధ్యం..

కళాశాల ప్రిన్సిపాల్ జేవి. సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం : పరస్పర సహకారంతోనే ఉపాధి అవకాశాలు సాధ్యమవుతాయని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జేవి సురేష్ బాబు, డిగ్రీ ఐటిఐ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ లు, కియా పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, శ్రీ సత్య సాయి జిల్లా వారి ఆధ్వర్యంలో , నైపుణ్య సమీకరణ, జ్ఞాన అవగాహనలతో జీవనోపాధుల పెంపుదల ధేయంగా ఁసంకల్పంు పేరుతో నేడు జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ డిగ్రీ, ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్స్ మరియు అధ్యాపకులకు ఎమర్జింగ్ టెక్నాలజీస్ , ఇండస్ట్రీస్ తో ఏ విధంగా అనుసంధానం అనే అంశాలపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అనంతరం ప్రిన్సిపాల్ తో పాటు పలువురు అతిథులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా హెల్త్ మినిస్టర్ సత్య కుమార్ యాదవ్ తరపున ఇంచార్జ్ హరీష్ బాబు ఆన్లైన్ ద్వారా పార్టిసిపెంట్స్ అందరితో కూడా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది అని తెలిపారు.వారు జిల్లాలో ఉన్నటువంటి నైపుణ్య అవకాశాలను కళాశాల ప్రిన్సిపల్స్ విద్యార్థులపై తీసుకోవలసిన బాధ్యత గురించి , వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో కళాశాల వారి పాత్ర గురించి క్లుప్తంగా వివరించడం జరిగిందన్నారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయా పరిశ్రమలకు కావలసిన నైపుణ్యం పెంచే ప్రయత్నం లో వారి సూచనలు సలహాలు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం జిల్లా యంత్రాంగం, పరిశ్రమల మధ్య సమన్వయం సాధించడం ముఖ్యం అన్నారు. పరిశ్రమలు పేర్కొన్న అంశాలను గుర్తించి ఆ మేరకు మెరుగైన శిక్షణాకార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు.సత్యసాయి జిల్లా పి డి, డి ఆర్ డి ఎ నరసయ్య మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి కళాశాలలు, ఇండస్ట్రీలు సంయుక్తంగా పనిచేసే యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముందుకు సాగాలన్నారు. అనంతరం జిల్లా పరిశ్రమల అధికారి నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రీ నైసర్గిక స్వరూపం ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి, వాటిని యువతి యువకులు సద్వినియోగపరుచుకునేలా చూడాలని కళాశాల ప్రిన్సిపల్స్ కి తెలియజేశారు.అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి హరికృష్ణ మాట్లాడుతూ జిల్లాలో జరిగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంల గురించి, కళాశాల ప్రిన్సిపల్ అందరూ కూడాను వారి కళాశాలలో ఉన్న కోర్సుల ఆధారంగా ఇండస్ట్రీ కనెక్ట్ చేసి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి కళాశాల కూడా ఇండస్ట్రీతో ఎం ఓ యు చేయవలసిన అవసరం ఉందని తెలియజేశారు. ఈరోజు జరిగే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ని ఉపయోగించుకోవాలని తెలియజేశారు.ఈ ప్రోగ్రాంకి రిసోర్స్ పర్సన్ అయినటువంటి టి శ్రీనివాసులు పి పి టి ప్రజెంటేషన్ ద్వారా ప్రస్తుత సమాజంలో విద్యార్థులపై ఉపాధ్యాయుల పాత్ర ఎంతగా ఉంటుందో, ప్రస్తుత జనరేషన్ కి అనుగుణంగా, ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించుకుని, జిల్లా అధికారుల సహకారంతో, విద్యార్థులందరి భవిష్యత్తుకు పునాదులు వేసే విధంగా అందరూ కూడా తగిన చర్యలు తీసుకుని , వారి భావితరాలను ముందుకు తీసుకువెళ్లాలని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ శ్రీ జె. వి సురేష్ బాబు మాట్లాడుతూ ఈ వర్క్ షాప్ కండక్ట్ చేయడానికి సహకరించిన రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి హరికృష్ణ కు కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో జిల్లాలో మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కియా పరిశ్రమ ప్రతినిధి పాల్గొని వారి పరిశ్రమ లకు కావలిసిన నైపుణ్యాలపై వారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు తెలియ చేయడం జరిగింది అని తెలిపారు. అనంతరం హాజరైన వారికి సర్టిఫికెట్ ప్రధానం చేయడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గం, ఎన్డీఏ కార్యాలయ, మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు,పలు ఇండస్ట్రీల ప్రతినిధులు, మానవ వనరులు ఎగ్జిక్యూటివ్ లు వివిధ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్, వివిధ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్స్, జిల్లా పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటిఐ ప్రిన్సిపల్స్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు