డి సి ఓ/పర్సనల్ ఇంచార్జ్ కృష్ణ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అభివృద్ధికి సభ్యులందరూ మరింతగా పాటుపడాలని డిసిఓ/పర్సనల్ ఇంచార్జ్ కృష్ణ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం బ్యాంకు లో మహాజన సభ సమావేశమును నిర్వహించారు. ఈ సందర్భంగా 2025-26 సంవత్సరమునకు బడ్జెట్ను సభ్యులకు బ్యాంకుల ఖర్చులు, ఆదాయము తదితర వాటిని కూడా వినిపించడం జరిగిందన్నారు. తదుపరి సభ్యులు ఆమోదించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు కార్యదర్శి సుధీర్ నాథ్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.
కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అభివృద్ధికి పాటుపడండి..
RELATED ARTICLES