Saturday, April 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిభూ కబ్జా చేస్తున్న వారిని అరెస్టు చేయాలి

భూ కబ్జా చేస్తున్న వారిని అరెస్టు చేయాలి

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర -ధర్మవరం ; ప్లంబర్ కార్మికులకు ప్రభుత్వము ఇచ్చిన భూమిలో కొంతమంది ఆక్రమణదారులు దౌర్జన్యంగా భూ కబ్జా చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి ముసుగు మధు ఒకటవ పోలీస్ స్టేషన్ పట్టణ సిఐ నాగేంద్ర ప్రసాద్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలోని సర్వేనెంబర్ 650-2 లో ప్రభుత్వం ప్లంబర్స్ కు కేటాయించింది అని, కానీ భూమి విలువ రేటు పెరగడంతో కొంతమంది పూర్తిగా ప్లంబర్స్ కార్మికులకు చెందకుండా అన్యాక్రాంతం చేయాలని ఒక్కొక్కరి పేరు మీద పది, పన్నెండు పట్టాలు సృష్టించి ప్లంబర్స్ కార్మికులకు మట్టి కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు అని మండిపడ్డారు.అనేక సంవత్సరాలుగా ప్లంబర్ కార్మికుల సొంత ఇంటి కలను దూరం చేస్తున్నారు అని తెలిపారు. ఇప్పటికైనా ప్లంబర్స్ కార్మికుల భూమి లో కబ్జాలకు పాల్పడే వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేయాలని సీఐను కోరడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, పట్టణ సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, ప్లంబర్స్ కార్మిక సంఘం అధ్యక్షు,కార్యదర్శి లక్ష్మీనారాయణ ,గోవిందరాజులు తోపాటు తాజు, ఆంజనేయులు, భాష, రామసుబ్బయ్య,అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు