Sunday, April 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినాటు సారా అనర్థాలపై అవగాహన సదస్సు..

నాటు సారా అనర్థాలపై అవగాహన సదస్సు..

ధర్మవరం ఎక్సైజ్ సీఐ చంద్రమణి
విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ;;రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవోదయం 2.0 లో భాగంగా ధర్మవరం ప్రోహిబిషన్ , ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నియోజకవర్గ పరిధిలోని ముదిగుబ్బ మండలంలోని గుడ్డంపల్లె తాండ గ్రామంలో నాటు సారా అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని ధర్మవరం ఎక్సైజ్ సీఐ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటు సారా తాగడం వల్ల దుష్పరిమాణాలు గురించి ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. అలాగే నాటు సారా త్రాగిన ,క్రయ , విక్రయాలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. అనంతరం ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ గోవిందా నాయక్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహులు, ముదిగుబ్బ ఎస్ఐ నాగభూషణం ధర్మవరం సబ్- ఇన్స్పెక్టర్స్ చాంద్ బాషా, నాగరాజు, సిబ్బంది స్కూల్ హెడ్ మాస్టర్స్,రెవిన్యూ అధికారులు, వీఆర్వోలు, వీఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శులు, మహిళా పోలీసు, ఫారెస్ట్ అధికారులు,విలేజ్ కానిస్టేబులు, గ్రామ సర్పంచులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు