విశాలాంధ్ర – హైదరాబాద్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జీహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ శివకుమార్ నాయుడు అధికారులను కోరారు. సోమవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు శివకుమార్ నాయుడు, వేణుగోపాల్, రఘు ప్రసాద్, చంద్రకాంత్ రెడ్డి, యాదగిరిరావు అడిషనల్ సిసిపిలు గంగాధర్ ప్రదీప్లు పాల్గొని నగరం నలు మూలల నుండి వచ్చిన ప్రజల నుండి విన్నపాలు స్వీకరించి, పరిష్కారం కోసం సంబంధిత అధికారు లను ఆదేశించారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాల యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 68 విన్నపాలు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ 26, ట్యాక్స్ సెక్షన్ 16, ఇంజనీరింగ్ విభాగం, హెల్త్ విభాగాలకు 4 చొప్పున, శానిటేషన్ విభాగానికి 3, యుబిడి, ఎలక్ట్రికల్, లేక్స్, ఐటీ విభాగాలకు 2 చొప్పున ఫిర్యాదులు అందగా, అడ్మినిస్ట్రేషన్, విజిలెన్స్, ట్రాన్స్ పోర్ట్ విభాగాలకు ఒకటి చొప్పున ఫిర్యాదులు అందాయి. ఫోన్ ఇన్ ద్వారా 4 ఫిర్యాదులు అందాయి. జిహెచ్ఎంసి పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 108 అర్జీలు వచ్చాయి. అందులో కూకట్పల్లి జోన్లో 52, సికింద్రాబాద్ జోన్లో 18, శేరిలింగంపల్లి జోన్లో 23, ఎల్బీనగర్ జోన్లో 9, చార్మినార్ జోన్లో 4, ఖైరతాబాద్ జోన్లో 2 ఆర్జీలు అందాయి. ప్రజావాణి కార్యక్రమంలో యుబిడి డైరెక్టర్ వెంకటేశ్వర్ రావు, వాటర్ వర్క్స్ జిఎం సాయి రమణ, డిప్యూటీ సిఈ పనస రెడ్డి హౌసింగ్, ఎస్టేట్ అధికారి ఉమా ప్రకాష్, ఈ.ఈ రాజేశ్వర్ రావు, పి.వి రమణ రావు, ఎస్.ఎన్.డి.పి ఈ.ఈ వెంకటేశ్వరరావు, ఓఎస్డి అనురాధ, ల్యాండ్ అక్విజిషన్ డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.