Tuesday, April 1, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపి సి ఎం ఆర్ ప్రైవేట్ పాఠశాల విద్యార్థి పై హాస్టల్ వార్డెన్ దాడి

పి సి ఎం ఆర్ ప్రైవేట్ పాఠశాల విద్యార్థి పై హాస్టల్ వార్డెన్ దాడి

విశాలాంధ్ర -ధర్మవరం ; మండలంలోని నాగలూరు గ్రామం వద్ద గల పిసిఎంఆర్ ప్రైవేట్ పాఠశాలలో ఆదివారం రాత్రి 10వ తరగతి చదువుతున్న కిషోర్అనే విద్యార్థి ను పైపుతో కొట్టడంతో శరీరం నిండా తీవ్ర గాయాలు పాలైన ఘటన చోటుచేసుకుంది. హాస్టల్ వార్డెన్ పై కూడా ఇంతకు మునుపు ఎన్నో ఫిర్యాదులు వచ్చినా కూడా యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో స్టడీ అవర్ ముగిసిన తర్వాత వార్డెన్ సందీప్, కిషోర్ అనే విద్యార్థి డయాసిస్ మీదకు మెల్లగా వెళుతుండడంతో ఆవేశంతో ఊగిపోయి పైపుతో తీవ్రంగా కొట్టడం జరిగింది. అక్కడికక్కడే విద్యార్థి కుప్పకూలి పోయాడు. ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులు సంఘాలప్ప రమాదేవికి తెలపడంతో వారు పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించిన తర్వాత వన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని వివిధ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ వార్డెన్ ఎందుకు చితకబాదాడో అతనికి అర్థం కాలేని పరిస్థితి చోటు చేసుకోవడం దారుణమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సందీపు పీసీఎంఆర్ పాఠశాలలో హాస్టల్లోనే ఉంటూ చదువును కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న వార్డెన్ సందీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కిషోర్ శరీరంపై తీవ్రంగా వాతలు పడ్డాయి. వార్డెన్ పై ఎంఈఓ కు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వేలకు వేలు డబ్బులు వసూలు చేస్తూ, విద్యార్థుల విషయంలో ఏమాత్రం శ్రద్ధ పట్టించుకోవడంలేదని తల్లిదండ్రులు తెలుపుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు