Tuesday, April 1, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరేషన్ కార్డుదారులకు ఈకేవైసీ గడువు నెల రోజులు పొడిగించాలి

రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ గడువు నెల రోజులు పొడిగించాలి

సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ; రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ చేయించుకోవడానికి మరో నెల రోజులు గడువును పొడిగించడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ నాయకులు మంగళవారం ముదిగుబ్బ రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించి, అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రెవెన్యూ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ సాయి గీతకు అందజేశారు.ఈ సందర్భంగా ఆ పార్టీ మండలకార్యదర్శి చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ రేషన్ కార్డుదారులు ఈనెల 30వ తేదీ లోపల ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో కార్డుదారులు సకాలంలో ఈకేవైసీ చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో రేషన్ కార్డుదారులు ముఖ్యంగా ఉపాధి నిమిత్తం బయట ప్రాంతాల్లో ఉంటున్న కూలీలు , విద్యాభ్యాస నిమిత్తం వివిధ కాలేజీలో ఉంటున్న విద్యార్థులు సకాలంలో తమ స్వగ్రామాలకు వచ్చి ఈ కేవైసీ చేయించుకోవడానికి అవకాశం లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనుక ప్రభుత్వం తక్షణమే కార్డుదారుల సంక్షేమం దృష్ట్యా మరో నెల రోజులపాటు గడువును పెంచి రేషన్ కార్డుదారులందరూ
ఈ కేవైసీ చేయించుకునే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో త్వరలోనే రేషన్ కార్డుదారులతో కలిసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించా. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ స్థానిక నాయకులు తిప్పయ్య, డాబా రామకృష్ణ, గంగిరెడ్డిపల్లి నాయుడు, లింగోట్ల వెంకట రాముడు, ఈశ్వర నాయక్, ఆటో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు