సిపిఎం పార్టీ నాయకులు
విశాలాంధ్ర -ధర్మవరం ; పట్టణంలోని కాలనీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ కి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు ఎస్ హెచ్ భాష ,జె.వి. రమణ, టి అయ్యూబ్ ఖాన్, మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలోని ఎల్సికేపురం ,ఎం.జీ కాలనీ, రాజశేఖర్ రెడ్డి కాలనీ, l.1, l.2 ,l.3 ,l.4, మొదలగు వార్డులలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నదని, విద్యుత్ సౌకర్యం లేదని, రోడ్ల సౌకర్యం లేవని, దాదాపుగా 20 సంవత్సరాలు పైబడి కాలనీలు ఏర్పడినప్పటికీ మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు చర్యలు చేపట్టలేదని, నీటి సమస్య తీవ్రంగా ఉండడంతో కాలనీ ప్రజలు అనేక రకాల సమస్యలకు గురి అవుతున్నారని బాధను వ్యక్తం చేశారు.ఎల్ 4, కాలనీ ప్రజలు నీటి సమస్య కోసం ఆందోళన కార్యక్రమం చేపట్టినప్పటికి ప రిష్కారం కోసం చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేయడం వ్యక్తం చేశార. కాలనీ సమస్యలు వెంటనే పరిష్కారం చేయకపోతే సి పీ.ఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో హైదర్ వలీ, కదిరప్ప, హరి, వెంకటస్వామి,ఖాదరభాష, రెడ్డప్ప, తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని కాలనీ సమస్యలను పరిష్కరించండి..
RELATED ARTICLES