విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో సాంకేతిక విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికి పారిశ్రామిక పర్యటన , అధ్యయనం చేసేందుకు ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు సారాభాయ్ స్పేస్ సెంటర్ , తుంభాను సందర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బండి రమేష్ బాబు మాట్లాడుతూ… పరిశోధనాత్మక యాత్ర విద్యార్థులు భారత అంతరిక్ష రంగంలోని పురోగతి, పరిశోధనా విధానాలను అన్వేషించేందుకు అవకాశం లభించినట్లు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధనా చరిత్ర , ప్రదర్శన,విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమం ప్రగతిని, విజయాలను విద్యార్థులకు వివరించింది.అంతరిక్ష మ్యూజియంలో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ , జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ , రీయూసబుల్ లాంచ్ వెహికల్ మోడల్స్ ప్రదర్శించబడ్డాయి. పిఎస్ఎల్వి హీట్ షీల్డ్, నాలుగో దశ ఘన ఇంధన మోటర్ , సౌండ్ ఇంగ్ రాకెట్లు , రాకెట్ టెక్నాలజీ, Rన-200 సౌండింగ్ రాకెట్ల , అభివృద్ధి, ప్రయోగ ప్రక్రియపై ప్రాథమిక అవగాహన అవగాహన కల్పించారు.
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సందర్శనకు పీవీకేకే విద్యార్థులు
RELATED ARTICLES