Tuesday, April 1, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిశరీర భాగాల పనితీరు, శరీర శక్తి తెలుసుకోవడమే సదరం క్యాంప్ ముఖ్య లక్ష్యం.. డాక్టర్ చందన

శరీర భాగాల పనితీరు, శరీర శక్తి తెలుసుకోవడమే సదరం క్యాంప్ ముఖ్య లక్ష్యం.. డాక్టర్ చందన

విశాలాంధ్ర ధర్మవరం:: శరీర భాగాల పనితీరు శరీర శక్తిని తెలుసుకోవడానికి సదరం క్యాంప్ ఎంతో ముఖ్యము అని సదరం క్యాంప్ డాక్టర్ చందన తెలిపారు. ఈ సందర్భంగా వారు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 46 మందికి వైద్య చికిత్సలో భాగంగా శరీరంలోని ఏ భాగం, ఎంత శాతం ఉన్న వాటిని వారు క్షుణ్ణంగా పరిశీలించారు. వారు మాట్లాడుతూ నెలలో ప్రతి బుధ, గురు, శుక్ర వారాలలో మాత్రమే సదరం క్యాంప్ ఉంటుందని తెలిపారు. సదరం క్యాంపుకు రావాలి అంటే సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని, తదుపరి సంబంధిత రోగికి మెసేజ్ తో పాటు ఫోన్ సమాచారం కూడా వస్తుందని తెలిపారు. నూతనంగా సదరం క్యాంపులో ఆధార్ అటెండెన్స్ తీసుకున్న తర్వాతనే సదరం క్యాంప్ నిర్వహించబడుతుందని తెలిపారు. ఇలా నిర్వహించడం వల్ల బోగస్ అరికట్టే అవకాశం ఉందని తెలిపారు. సదరన్ క్యాంపులో నిర్వహించిన వాటి నివేదికలను మంగళగిరి కి పంపించ బడునని, తదుపరి అక్కడనుండి తగిన సర్టిఫికెట్లు పంపించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సదరం క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు