Wednesday, May 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజిల్లా కలెక్టర్ చేతన్ చే అభినందనలు అందుకున్న మానస నృత్య కళా కేంద్రం

జిల్లా కలెక్టర్ చేతన్ చే అభినందనలు అందుకున్న మానస నృత్య కళా కేంద్రం

విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లో ఉగాది పండుగ సందర్భంగా ధర్మవరం పట్టణానికి చెందిన మానస నృత్య కళా కేంద్రం వారు ప్రదర్శించిన ప్రత్యేక నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆ ప్రదర్శన చూచిన జిల్లా కలెక్టర్ చేతన్ ప్రత్యేకంగా అభినందించారు. తదుపరి కలెక్టర్ చైతన్ మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే మానస చదువుతోపాటు నాట్యం పట్ల ఆసక్తి చూపడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. అంతేకాకుండా తాను నేర్చిన నృత్యాలను చిన్నారులకు నేర్పించి పలుచోట్ల ప్రదర్శనలు ఇవ్వడం ఎంతో సంతోషించదగ్గ విషయమని తెలిపారు. తల్లిదండ్రులు కూడా చదువుతోపాటు నృత్యము, క్రీడలు, కరాటే నేర్పావాలన్నారు. అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా గురువుతో పాటు శిష్య బృందం కు బహుమతులు ప్రధానం చేసి, గురువు మానసను ప్రత్యేకంగా సన్మానించారు. మానస వివిధ చోట్ల నృత్య ప్రదర్శన ఇవ్వడం, మానస ను ప్రోత్సహించిన తల్లిదండ్రులను కూడా కలెక్టర్ అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు