విశాలాంధ్ర -ధర్మవరం:: మండల పరిధిలోని నిమ్మలకుంట గ్రామంలో పశువుల నీటి తొట్టె నిర్మాణం కోసం భూమి పూజను ఎంపీడీవో సాయి మనోహర్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో భాగంగా వేసవిని దృష్టిలో ఉంచుకొని పశువుల తాగు నీటి అవసరాలను తీర్చుటకు పశువుల నీటి తొట్టె నిర్మాణం పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టడం జరిగింది అన్నారు. ఒక్కొక్క నీటి తొట్టేకు రూపాయలు 33,220/- ప్రకారం
మండలం నందు ప్రస్తుతం 77 కొత్త వాటిని నిర్మాణం చేయడం జరుగుతుందని, వీటికి మొత్తం రూపాయలు 25,57,950/- ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు.వీటిని ఉపాధిహామీ నిధులతో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ విష్ణు వర్ధన్ రెడ్డి , ఏపీఓ అనిల్ కుమార్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మురళీ, టి ఏ చంద్రకళ ,ఇంజనీరింగ్ అసిస్టెంట్ తేజ , ఎఫ్ ఏ. చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ రమణ , గ్రామ నాయకులు కుళ్లాయప్ప రైతులు పాల్గొన్నారు.
పశువుల తాగునీటి తొట్టె నిర్మాణముకు ప్రారంభం.. ఎంపీడీవో సాయి మనోహర్
RELATED ARTICLES