Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్ఏపీలో మొదలైన ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం..

ఏపీలో మొదలైన ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైందని, ఈ నెల రెండో వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించగా.. దాదాపు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు పూర్తవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించిన అధికారులు.. ఈ నెల 12 నుంచి 15వ తేదీలోపు ఫలితాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 6వ తేదీలోగా మూల్యాంకనం పూర్తవుతుందని, వాటిని ఆన్ లైన్ లో నమోదు చేయడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కంప్యూటరీకరణ పూర్తయిన తర్వాత ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకూ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు విడుదల చేసేవారు. ఈసారి ఇంటర్ ఫలితాలను వాట్సప్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. విద్యార్థులు వాట్సాప్‌ నంబర్ 9552300009 ద్వారా లేదా  BIEAP అధికారిక వెబ్‌సైట్‌ https://bie.ap.gov.in/ ద్వారా తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చని అధికార వర్గాల సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు