సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్ లపై విచారణ నేడు పూర్తి అయింది.. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ల సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. నేడు అసెంబ్లీ సెక్రటరీ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తన వాదనలు వినిపించారు.. అనర్హత ఎమ్మెల్యే పై విచారణను స్పీకర్ కొనసాగిస్తున్నారని,అ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్నారు.. ఇంతలోనే దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించడంలో అర్ధం లేదని అన్నారు.. ఇప్పటిక ఆ 10 ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీస్ లు జారీ చేశారని వ్యవరించారు.. రాజ్యంగ బద్దమైన వ్యవస్థలో కోర్టులు జోక్యం చేసుకోజాలవంటూ వివిద తీర్పులను వివరించారు. తక్షణం ఈ పిటిసన్ లను కొట్టివేయాలని అభిషేక్ ధర్మసనాన్ని అభ్యర్దించారు.కాగా, బుధవారం నాడు అసెంబ్లీ స్పీకర్ తరపు వాదనలు ముగిశాయి. స్పీకర్ తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల తరఫున వాదనలను సుప్రీంకోర్టు రికార్డు చేయనుంది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నాలుగేళ్ల పాటు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ ఉండాల్సిందేనా అని సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. తమ పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినా.. స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది ధర్మాసనం.