పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించిన ట్రంప్
ఉత్తర కొరియా, రష్యా, బెలారస్, క్యూబా సహా పలు దేశాలకు సుంకాల నుంచి మినహాయింపు
ఆయా దేశాలపై ఇప్పటికే పలు ఆంక్షలు ఉన్నందున ఈ సుంకాలు వర్తించవన్న వైట్‌హౌస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు. అయితే, ఆయన పరస్పర సుంకాల ప్రకటన నుంచి కొన్నిదేశాలకు మినహాయింపు లభించింది. అందులో ఉత్తర కొరియా, రష్యా, బెలారస్, క్యూబా సహా పలు దేశాలు ఉన్నాయి. ఆయా దేశాలపై ఇప్పటికే పలు ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఈ సుంకాలు వర్తించవని అధికార భవనం వైట్‌హౌస్ వెల్లడించింది. ఇక అన్ని దేశాల వారు తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్‌లో అమ్ముకోవచ్చని, అయితే కనీసం 10 శాతం సుంకం చెల్లించాలని ట్రంప్ తెలిపారు. ఈ క్రమంలో ఆయన పలు దేశాలకు సుంకాల నుంచి మినహాయింపు కల్పించడం జరిగింది. కాగా, భారత్‌పై కూడా 26 శాతం టారిఫ్‌ను విధించిన విషయం తెలిసిందే.
పలు దేశాలకు సుంకాల నుంచి మినహాయింపు..
RELATED ARTICLES