Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

టీమిండియా కోచ్‌గా నేనుండను : జయవర్దనే

ముంబై: టీ20 ప్రపంచకప్‌ అనంతరం టీమిండియా ప్రధాన కోచ్‌ పదవికి రవిశాస్త్రి రాజీనామా చేయనున్నారనే వార్తలొస్తుండటంతో కొత్త కోచ్‌కు సంబంధించి బీసీసీఐ అన్వేషణ మొదలుపెట్టినట్లు తెలిసింది. దీనికి అనుగుణంగానే కోచ్‌ పదవికి సంబంధించి రోజుకో పేరు బయటికి వస్తోంది. తొలుత ద్రవిడ్‌, సెహ్వాగ్‌లలో ఎవరు ఒకరు కోచ్‌ పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కుంబ్లే, లక్ష్మణ్‌ పేర్లు కూడా వినిపించాయి. తాజాగా బీసీసీఐ శ్రీలంక మాజీ క్రికెటర్‌ మహేళ జయవర్దనేని కోచ్‌ పదవి కోసం సంపద్రించినట్లు సమాచారం. అయితే జయవర్దనే బీసీసీఐ ఇచ్చిన ఆఫర్‌ను సున్నితంగా తిరస్క రించినట్లు తెలిసింది. జయవర్దన ప్రస్తుతం శ్రీలంక అండర్‌-19 క్రికెట్‌ టీమ్‌కు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా కోచ్‌ కంటే శ్రీలంక ప్రధానకోచ్‌గా ఉండేదుకు ఇష్టపడుతున్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img