Friday, April 4, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాహలో చైర్మన్ కు భారీ స్పందన…

హలో చైర్మన్ కు భారీ స్పందన…

విశాలాంధ్ర నందిగామ:-పట్టణ పరిధిలో మీ సమస్యలు ఎటువంటివైనా మా దృష్టికి తీసుకువస్తే వీలైనంత త్వరగా సమస్యలకు పరిష్కారం చూపుతామంటూ హలో చైర్మన్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటానని మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి అన్నారు ఇటీవల నందిగామ శాసనసభ్యులు ఆదేశాల మేరకు హలో చైర్మన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆమె తెలిపారు హలో చైర్మన్ కార్యక్రమానికి పట్టణంలో నుండి స్పందన బాగా వస్తుందని అన్నారు ముఖ్యంగా ప్రభుత్వ వైద్యశాల నందు వీధిలైట్లు వెలగటం లేదంటూ ఎక్కువ ఫిర్యాదులు రావడం హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు అభ్యర్థన మేరకు వెంటనే మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించగా గురువారం డివిఆర్ హాస్పిటల్ నందు వీధిలైట్లను ఆమె అందించారు అలాగే పలు వార్డుల్లో వీధిలైట్లు వెలగడం లేదని ప్రజల నుండి సమాచారం రావడంతో ఆ వార్డు ఇన్చార్జిలను పిలిపించి వారికి వీధిలైట్లు వెంటనే ఏర్పాటు చేయాలని అందించడం జరిగినట్లు తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ పట్టణంలో ఇటువంటి సమస్యలు ఉన్న హలో చైర్మన్ ద్వారా మా దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కార దిశకు తీసుకెళ్తామని పేర్కొన్నారు అంతకుముందు హాస్పిటల్ ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు రోగులతో ముచ్చటించారు వారికి జరుగుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు 92814 23339 ద్వారా మీ సమస్యలను తెలియజేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండవ శ్రీనివాసరావు కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు