Friday, April 4, 2025
Homeజిల్లాలుపశ్చిమ గోదావరిగ్రామాల్లో 30 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం

గ్రామాల్లో 30 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం

విశాలాంధ్ర – తాడేపల్లిగూడెం రూరల్: గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు లాంటి అభివృద్ధి పనులు చేసి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని ప్రభుత్వ ‘విప్, స్థానిక ఎమ్మేల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం మండలంలోని నవాబ్పాలెం, జగన్నాధపురం, మాధవరం, అప్పారావుపేట తదితర గ్రామాల్లో 30 కోట్లతో నిర్మాణం చేసిన సిసి, బిటి రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు ఓట్లు వేసి నన్ను గెలిపించారని వారి రుణం తీర్చుకునేందుకు గ్రామాలను కోట్ల రూపాయలను వెచ్చించి అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం ! చేశామన్నారు. నియోజకవర్గంలో ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ పధకాలు పారదర్శకంగా అందిస్తూ అవినీతిరహిత సమాజాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం గ్రామపంచాయితీ . వ్యవస్ధను నిర్వీర్యం చేసిందన్నారు. అభివృద్ధి పనుల పేరుతో కోట్లాదిరూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు సిగ్గుపడేలా గ్రామాల్లో స్వరాజ్య పాలన అందిస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నాటినుండి నేటి వరకు గ్రామాలను అనుసంధానం చేసే విధంగా పంచాయితీ, ఆర్ అండ్ బి రోడ్లు నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు.
వచ్చే ఐదేళ్ళలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సహకారాలతో నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఏరియా అసుపత్రిలో 2 కోట్లతో డయాలసిస్ సెంటర్ అభివృద్ధి చేశామన్నారు. విప్పర్రు నుండి గణపవరం వరకు రహదారి నిర్మాణం త్వరలో చేపడతామన్నారు. గ్రామాల్లో ఉపాది హామీ పధకం ద్వారా ఎక్కువ రోజులు పనికల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. దీనిని ఉపాధి కూలీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిమీద ద్వేషం లేదన్నారు. గత ప్రభుత్వంలోఉన్న మాజీ ఎమ్మెల్యే తనపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సమయం వృధా చేయకుండా అభివృద్ధి పనులే లక్ష్యంగా కూటమి నాయకులతో కలిసి పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలస్థాయి అధికారులు, బిజెపి నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, సర్పంచ్లు ముప్పిడి సూర్యకుమారి, ఉండ్రాజవరపు చంద్రిక, ఆరుగొల్లు శ్రీనివాస్, కూటమి నాయకులు, పంచాయితీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు