Friday, April 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచలో విజయవాడ కార్యక్రమంకు పారిశుద్ధ్య కార్మికులకు అనుమతి ఇవ్వండి

చలో విజయవాడ కార్యక్రమంకు పారిశుద్ధ్య కార్మికులకు అనుమతి ఇవ్వండి

… సిఐటియు నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం ; చలో విజయవాడ కార్యక్రమమునకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ కి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ జే వి రమణ, కో కన్వీనర్ టి.అయుబ్ ఖాన్ , కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఏం. బాబు, ముకుంద, లక్ష్మి ఓబులేసు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఆప్కాస్ పద్ధతిని రద్దు చేసి, కాంట్రాక్టు విధానం అమలు చేయాలనే ఆలోచనలను విరమించుకోవాలని, అలాకాని పక్షంలో కార్మికులకు రెగ్యులర్ చేయాలన్నారు. ఇప్పటికే కార్మికులకు కనీస వేతనాలు అమలు కాక అనేక విధాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారని, కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, చనిపోయిన కార్మిక కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించక పోవడంతో వారు అనేక ఇబ్బందులకు గురవుతుంటే, ఇప్పుడేమో పుండు మీదకారం చల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ పద్ధతిని రద్దుచేసి, కాంట్రాక్ట్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పడం కార్మికులకు మరింత నష్టం కలిగించే విధంగా ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం.ఇటువంటి దుర్మార్గపు కాంట్రాక్టు విధానాల్ని.వెంటనే విరమించుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికులు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మాత్యులకు వినతి పత్రం ఇవ్వడంకోసం. విజయవాడ వెళ్లడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ శ్రీ ప్రమోద్ కుమార్కు వివరించడం జరిగిందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు