Saturday, April 5, 2025
Homeజిల్లాలుకర్నూలురైతు సదస్సుకు తరలి వెళ్లిన రైతు సంఘం నాయకులు

రైతు సదస్సుకు తరలి వెళ్లిన రైతు సంఘం నాయకులు

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) :రైతుల సమస్యల పరిష్కారం కోసం కర్నూలులో జరిగే జాతీయ రైతు సదస్సుకు శుక్రవారం రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ ఆధ్వర్యంలో నాయకులు, రైతులు ప్రత్యేక వాహనంలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాక పోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఇంత జరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతును రక్షించాలంటే, వ్యవసాయాన్ని కాపాడుకోవాలంటే రైతుకు బ్యాంకులో ఉన్న అప్పు రద్దుచేసి, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ సదస్సుకు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరేష్, మహాదేవ, చాకలి మల్లయ్య, గిడ్డయ్య, నరసప్ప, లక్ష్మన్న, రామాంజనేయులు, కల్లుకుంట వీరేష్, జింక రమేష్, ఆంజనేయులు, నర్సింహులు, లింగన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు