రాష్ట్ర సెర్ప్ సీఈఓ కరుణ వాకటి
గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు తలసరి ఆదాయం పెంచేలా చర్యలు
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : మహిళల జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యమని రాష్ట్ర సెర్ప్ సీఈఓ కరుణ వాకటి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం నగరంలోని అలెగ్జాండర్ హోటల్ లో విలువ ఆధారిత మార్కెటింగ్ ( వాల్యూ చేంజ్ డెవలప్మెంట్ అండ్ మార్కెటింగ్ ఇంటర్వెన్షన్) పై రాష్ట్రస్థాయి వర్క్ షాప్ ను నిర్వహించగా, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి రాష్ట్ర సెర్ప్ సీఈఓ కరుణ వాకటి, ఐ.ఏ.ఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెర్ప్ సీఈఓ కరుణ వాకటి, ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళల జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా ఫ్లిప్ కార్ట్ మరియు సెర్ప్ ఆధ్వర్యంలో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినందుకు ఫ్లిప్కార్ట్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. కందులు, వేరుశనగ, బియ్యం, చిరుధాన్యాలు, తదితర పంటలలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పిడిలు, డిపిఎంలు, అత్యంత ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. రైతుల పండించే పంటలలో నాణ్యత చాలా ముఖ్యమన్నారు. మార్కెట్‌తో అనుసంధానించబడిన ఉత్పత్తిదారుల సమూహాలను స్థాపించడానికి అట్టడుగు వ్యవసాయ వర్గాల నుండి గ్రామీణ మహిళల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఫ్లిప్కారట్ కృషి చేస్తోందన్నారు. వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ (వేరుశెనగ, బెంగాల్ గ్రాము, మొక్కజొన్న మరియు మినుములు) మార్కెటింగ్ ఇంటర్వెన్షన్‌పై ఫ్లిప్‌కార్ట్ (ఎం ఓ యూ భాగస్వామి) సహకారంతో 4 ఏప్రిల్ 2025న పైలట్ ప్రాతిపదికన అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించి ఒక రోజు రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ నిర్వహించబడుతోందన్నారు. దీనిని రైతులంతా ఉపయోగించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి మాట్లాడుతూ అనంతపురం నగరంలోని అలెగ్జాండర్ హోటల్లో రీజినల్ లెవెల్ వర్క్ షాప్ సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంగా నిర్వహించిన ఈ వర్క్ షాప్ లో అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన పిడీలు, డిపిఎంలు, ఏపీఎం- ఎఫ్పిఓలు, ఎఫ్పిఓ బోర్డు డైరెక్టర్స్, ఏపీఎంలు- ఎంఎస్ లు పాల్గొనడం జరిగిందన్నారు. రాష్ట్రస్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఫ్లిప్ కార్ట్ మరియు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ)ఆధ్వర్యంలో ఎంఓయు కుదుర్చుకున్నారన్నారు. అందులో భాగంగా ఐదు జిల్లాలకు సంబంధించి తొలి వర్క్ షాప్ ను నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలాంటి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు తలసరి ఆదాయం పెంచే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. దళారుల ఇబ్బందులు లేకుండా ప్రతి కేజీకి ఎక్కువ ధరను తీసుకొచ్చేలా మంచి ఆలోచనను రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారని, తద్వారా జిల్లా కేంద్రంలో ఈ వర్క్ షాప్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. దీనిని విజయవంతం చేస్తూ ఈ వర్క్ షాప్ ను ప్రారంభించుకున్నామని తెలిపారు. నిర్ణీత గడువులను నిర్ణయించుకుని రాబోయే రోజుల్లో దీనిని ఎలా అమలు చేస్తామనే అంశంపై ఇందులో చర్చించడం జరుగుతుందన్నారు. భారతదేశంలో ఫ్లిప్ కార్ట్ సంస్థ రెండు రాష్ట్రాలతో ఎంవోయులు కుదుర్చుకోవడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత తొలి వర్క్ షాప్ ను జిల్లాలో నిర్వహించడం శుభసూచకం అన్నారు. ఈ అంశంలో రైతులకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయి సహకారం అందించాలని, రైతులకు తగు సూచనలు, సలహాలు అందజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సెర్ప్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ బి.శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, డీఆర్డీఏ పిడి బి.ఈశ్వరయ్య, ఇతర జిల్లాల డీఆర్డీఏ పిడిలు నరసయ్య, ఆనంద్ నాయక్, శ్రీధర్ రెడ్డి, రమణారెడ్డి, ఫ్లిప్ కార్ట్ గ్రాసరి మేనేజర్ గిరిబాబు, సెర్ప్ అదనపు డైరెక్టర్ సరళ, సెర్ప్ అదనపు డైరెక్టర్ మహిత, డీఆర్డీఏ-వెలుగు డిపిఎం బి.గంగాధర్, జిల్లా సమాఖ్య సెక్రెటరీ, విఓఏలు, తదితరులు పాల్గొన్నారు.