విశాలాంధ్ర -ధర్మవరం: ధర్మవరం డివిజన్ పరిధిలో వరి పంటకు కాండం తొలిచూపు ఆశించి కంకులన్నీ కూడా తెల్లగా మారుతున్నాయని డివిజన్ పరిధిలోని రైతన్నలు తమ బాధను, ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ పరిధిలోని ఏడు మండలాలలోని పలు గ్రామాలలో రైతన్నలు వరి పంట వేయడం జరిగింది. కానీ దిగుబడి తెల్ల కంకులు రావడంతో పూర్తిగా తగ్గే అవకాశం ఉందన్న భయాందోళనలు వెన్నంటుతున్నాయి. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు వెలవెలలాడుతున్నారు. పలు మండలాలలో రైతులు వ్యవసాయ బోర్లు, చెరువుల కింద వరి పంట సాగు చేయడం జరిగింది. కానీ ఈ పంట కంకి పోయి గింజలు పట్టే దశలో ఉండడంతో, రైతన్నల ఆశలు అడియాసలు కావడం జరిగింది. రైతన్నలు తెలిపిన విధంగా ఎకరాకు 35 నుండి 40 బస్తాలు పంట సరిగా పండితే వస్తుంది. కానీ ఎకరాకు పది బస్తాలు కూడా రావు అని రైతన్నలు బాధని వ్యక్తం చేస్తున్నారు. ఈ వరి పంటలో తెల్ల కంకులు రావడంతో దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు తెలుపుతున్నారు. అంతేకాకుండా లక్షల రూపాయల్లో పెట్టుబడి పెట్టి ఆశించినంతలో ఎకరాల్లో పంట వేస్తే ఓవైపు విద్యుత్ కోతలు మరోవైపు పంటకు తెగుళ్లు ఆశించడంతో పంట దిగుబడి తగ్గుతోందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా డివిజన్ పరిధిలోని పలు క్రిమిసంహారక మందులన్నింటినీ వినియోగించినా కూడా ఫలితం లేదని, డూప్లికేట్ మందులు కూడా రావడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు రైతన్నలు. వ్యవసాయ అధికారులు గానీ శాస్త్రవేత్తలుగాను క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి, రైతన్నలకు తగు సూచనలు ఇవ్వాలని రైతన్నలు కోరుతున్నారు.
వరి పంటలో తెల్ల కంకులు అధికం-రైతుల ఆందోళన-దిక్కు తోచని స్థితిలో రైతన్నలు
RELATED ARTICLES