Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్పేదలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ప్రధాన లక్ష్యం..

పేదలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ప్రధాన లక్ష్యం..

అధ్యక్షుడు జయసింహ
విశాలాంధ్ర ధర్మవరం: పేదలకు కంటి వెలుగులు ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ప్రధాన లక్ష్యము అని అధ్యక్షుడు జయసింహ, కార్యదర్శి నాగభూషణం, కోశాధికారి సుదర్శన్ గుప్తా, క్యాంపు చైర్మన్ పుట్లూరు రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాంస్కృతిక మండలి లో ఈనెల 13వ తేదీన నిర్వహించబడే ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం యొక్క కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు దాసరి నారాయణప్ప, జ్ఞాపకార్థం సతీమణి దాసరి బసమ్మ, కోడలు దాసరి లక్ష్మీదేవి, కుమారుడు దాసరి రామచంద్ర దాతృత్వంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరము రోటరీ క్లబ్, శంకర కంటి ఆసుపత్రి బెంగళూరు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ – శ్రీ సత్యసాయి జిల్లా వారి సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల లో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించబడునని తెలిపారు. ఉచిత వైద్య శిబిషలతోపాటు ఆపరేషన్కు ఎంపికైన వారికి ఉచిత ఆపరేషన్లు, ఉచిత రవాణా, ఉచిత వశతి, ఉచిత భోజనం, ఉచితంగా అద్దాలను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. శిబిరానికి వచ్చువారు రేషన్ కార్డు లేదా ఓటర్ గుర్తింపు కార్డులలో ఏదైనా రెండు జిరాక్స్ కాపీలు మూడు ఫోటోలు తప్పకుండా తీసుకొని రావాలని తెలిపారు. బిపి ,షుగర్ ఉన్నవారు పరీక్షలు నిర్వహించుకొని తగ్గించుకొని రావాలని తెలిపారు. కంటి నిపుణుల సలహాలతో కళ్ళలలో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ ,గ్రామీణ ప్రాంతాలలో గల కంటి సమస్య ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర రెడ్డి, సత్రశాల ప్రసన్నకుమార్, కొండయ్య, దాత దాసరి రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు