విశాలాంధ్ర- ధర్మవరం : మానవులకు చేసే సేవ దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని 380 మంది రోగులకు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్లను వైద్యు లు, సిస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం నామా ప్రసాద్ మాట్లాడుతూ నేటి ఈ అన్నదాన సేవా కార్యక్రమానికి దాతలుగా కీర్తిశేషులు దాసరి తులుసమ్మా, వెంకటస్వామి వారు నిర్వహించడం పట్ల ఆ కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేశారు. దాతల సహాయ సహకారములతోనే ఇటువంటి సేవా కార్యక్రమాలను గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని, పుట్టపర్తి బాబా ఆశీస్సులతో భక్తాదులు కూడా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వారి తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సమితి చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు రోగులకు వరంలాగా మారాయి, ఎంతోమందికు స్ఫూర్తిని ఇస్తున్నాయని తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, రోగులు తరఫున శ్రీ సత్య సాయి సేవా సమితి వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.
మానవులకు చేసే సేవ దైవ సేవతో సమానం.. కన్వీనర్ నామా ప్రసాద్
RELATED ARTICLES