విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం పట్టణం బొబ్బిలి రోడ్డు మాదిగ వీధి జంక్షన్ వద్ద డాక్టర్ బాబుజగజీవన్ రామ్ జయంతి వేడుకలు రాజాం నియోజకవర్గ ఎంఈఎఫ్ అధ్యక్షులు అరసాడ ఆనందరావు, యందవ నారాయణరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. డా” బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి 118 జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగ సమైక్య నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు మాదిగ విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.