Sunday, May 25, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅయ్యప్ప స్వామి దేవాలయమునకు మైక్ సెట్ వితరణ..

అయ్యప్ప స్వామి దేవాలయమునకు మైక్ సెట్ వితరణ..

తిరుమల తిరుపతి దేవస్థానం వారు
విశాలాంధ్ర ధర్మవరం;; తిరుమల తిరుపతి దేవస్థానం వారు రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాలకు కావలసిన పూజా సామాగ్రి, మై చెట్టు తదితర వాటిని సబ్సిడీ రేటు పై అతి తక్కువ ధరతో ఆలయ కమిటీ సభ్యులకు అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే పట్టణంలోని శాంతినగర్ లో గల శ్రీ జ్యోతి స్వరూప అయ్యప్ప స్వామి దేవాలయమునకు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మచార్యులు నక్కల వెంకటేష్ ఆధ్వర్యంలో మైక్ చెట్టును ఆలయ కమిటీ వారికి అందజేశారు. ఈ సందర్భంగా నక్కల వెంకటేష్ మాట్లాడుతూ ఇప్పటికే ధర్మవరం, చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలలో వెలసిన దేవాలయాలకు ఆలయానికి సంబంధించినటువంటి అన్ని వస్తువులను అతి తక్కువ సబ్సిడీ రేటు పై అందజేస్తున్నామని తెలిపారు. అనంతరం గురుస్వామి రవీంద్ర మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం సంతోషించదగ్గ గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోలమరం రవీంద్రారెడ్డి, పెద్దకోట్ల నరసింహులు, ఆలయ కమిటీ, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు