Sunday, April 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం లో డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం లో డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: స్వాతంత్ర  సమర యోధుడు బాబు జగ్జీవన్ రామ్ అని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు పేర్కొన్నారు అని. శనివారం
విశ్వవిద్యాలయములో డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి ఉపకులపతి , ఓ ఎస్ డి .వీసీ దేవన్న, రిజిస్ట్రార్ ఆచార్య ఎస్. కృష్ణయ్య , డైరెక్టర్లు నివాళులర్పించారు. వీసీ మాట్లాడుతూ.. చిన్న వయస్సులో మొదటి కేబినేట్ లో మంత్రి పదవి సాధించిన ఏకైక వ్యక్తీ అని తెలిపారు. కేంద్రమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా పని చేశారని, తనకితాను నిర్మించుకున్న భారతదేశ ‘అమూల్య రత్నం’ డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ అని కొనియాడారు. ఇంజినీరింగ్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఆచార్య పి.చెన్నారెడ్డి ఆద్వర్యంలో బాబు జగ్ జీవన్ రామ్.జయంతి ని వేడుకలకు నిర్వహించగా అధ్యాపక బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు