చైర్మన్ తో పాటు డైరెక్టర్ల జాబితా విడుదల
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గా బిజెపి సీనియర్ నాయకురాలు అంబటి అరుణశ్రీ ను చైర్పర్సన్ గా రాష్ట్ర ప్రభుత్వం జాబితాను విడుదల చేసింది. అధికార పూర్వకంగా జిల్లా మార్కెటింగ్ అధికారి మూర్తి తెలిపారు . మార్కెట్ యార్డ్ జాబితాలో ధర్మవరానికి చెందిన అంబటి అరుణశ్రీ చైర్పర్సన్ గా, మూళ్ళ గూరి అయ్యప్ప వైస్ చైర్మన్ గా, సభ్యులుగా అచ్చమ్మ, చారు గుండ్ల రాములమ్మ, గిర్రాజు పద్మనాభం, కే. పోతులయ్య, కే.రవీంద్ర, సాంబశివ నాయక్, కమతం వాణి, ఎం. నాగమణి, ఆజాద్ బాబు, రాఘవరెడ్డి, సాకే ఓబులేష్, తమ్మినేని నాగలక్ష్మి, వేంపల్లి నాగూర్బి కలరు. ప్రభుత్వం నుంచి జీవో రాగానే నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతుందని అధికారి మూర్తి తెలిపారు. తదుపరి బిజెపి సీనియర్ నాయకుడు అంబటి సతీష్, భార్య అంబటి అరుణశ్రీయులు పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ గౌరవపూర్వకంగా కలిశారు.
మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గా అంబటి అరుణశ్రీ
RELATED ARTICLES