Monday, April 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరహదారికి మరమ్మత్తులు చేపట్టాలని కాలనీవాసులు మంత్రికి వినతి

రహదారికి మరమ్మత్తులు చేపట్టాలని కాలనీవాసులు మంత్రికి వినతి

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణములోని గుడ్ సెట్ కొట్టాల కాలనీలో రహదారికి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతూ కాలనీకి విచ్చేసిన ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ కు ఆ కాలనీ ప్రజలు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ జే వి రమణ , కాలనీ ప్రజలు మాట్లాడుతూ ధర్మవరం ఒకటో వార్డు జిఎస్ కొట్టాలు లో దాదాపుగా 400 కుటుంబాలు నివాసం ఉన్నామని, కాలనీలో రహదారులు, సైడ్ కాలువలు పూర్తిగా పాడైపోయినాయని వాటికి మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా కాలనీలో పేద ప్రజలకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిన వారికి హౌసింగ్ వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు