శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని పుట్టపర్తి రోడ్ సాయి నగర్ లో గల శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని సాయిబాబా సేవా సమితి అధ్యక్షులు వీరనారాయణ, కార్యదర్శి రామలింగయ్య, ఉపాధ్యక్షులు డిసి నారాయణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరం శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి ధర్మవరం, పుష్పగిరి కంటి ఆసుపత్రి, కడప వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. కంటి డాక్టర్లు వచ్చిన రోగులకు కంటి వైద్య చికిత్సలను అందించడం జరిగిందన్నారు. అనంతరం ఈ శిబిరంలో 70 మందిని కంటి ఆపరేషన్లకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. కంటి ఆపరేషన్లు పరీక్షలు పూర్తిగా ఉచిత ఆరోగ్య సేవా కార్యక్రమం కింద నిర్వహించినట్లు తెలిపారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులకు వైద్య నిపుణులచే కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ఉచిత రవాణా ఖర్చులు, ఉచితంగా ఆపరేషన్లు, ఉచిత వశతి, ఉచిత భోజనాలు కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాన్ని మా శిరిడి సాయిబాబా కళ్యాణ మండపంలో నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో షిరిడి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
ఉచిత కంటి వైద్య శిబిరమునకు విశేష స్పందన..
RELATED ARTICLES