Tuesday, December 3, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివ్యవసాయమా…. మేము పిల్లనివ్వం…?

వ్యవసాయమా…. మేము పిల్లనివ్వం…?

యువ వ్యవసాయదారులకు పెళ్లిళ్లు కష్టమేనా…?
రాబోయే కాలంలోనైనా రైతన్నను గుర్తించేరా….?
విశాలాంధ్ర -చిలమత్తూర్ రూరల్….(శ్రీ సత్య సాయి జిల్లా) :
పూర్వకాలంలో వ్యవసాయం చేసేవారు చెడిపోరన్నది ఒకప్పటి మాట, ప్రస్తుత కాలం పంటలు పండించేవారు చెడిపోతున్నారన్నది నేటి మాట, గత పూర్వకాలం వ్యవసాయమే రైతులకు ఆధారం, నేడు ఎవరినైనా వ్యవసాయం చేస్తారా అని ప్రశ్నిస్తే చేయమని ముఖం మీదే చెప్పేస్తారు, గతంలో పంట పొలాలు గడ్డివాములు పశువుల గోదాములు, ఎరువు దిబ్బలు పరిశీలించి పిల్లను ఇచ్చేందుకు ఆసక్తిగా ముందుకు వచ్చేవారు, ప్రస్తుతం అది పూర్తిగా మారిపోయింది వ్యవసాయ యువ రైతులు పెళ్లి సంబంధాలు చూడడానికి వెళితే నీవు ఏం చేస్తావు అంటూ ప్రశ్నిస్తారు తాను మంచి వ్యవసాయ దారుడు అంటే పిల్లను ఇచ్చేందుకు ముఖం చాటేస్తూ అయితే మళ్లీ ఫోన్ చేస్తాము అంటూ సమాధానం వస్తుంది దీంతో యువ రైతులు పెళ్లి కాక వ్యవసాయాన్ని చేయలేక పొట్ట చేత పట్టుకొని చిన్నచిన్న ఉద్యోగాల కోసం వలస వెళ్లే దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమాజంలో దాదాపు రైతులు వ్యవసాయం చేయడానికి ఇష్టపడడం లేదని తెలుస్తుంది పట్టణాలలో ఏదైనా పరిశ్రమలో చిన్న ఉద్యోగం ఉంటే చాలు కాళ్లు కడిగి పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తారు ఎంత పెద్ద వ్యవసాయదారుడైన సరే పిల్లను ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో వందలాదిమంది యువ రైతులు ఇప్పటికీ చిరంజీవులుగా మారిపోతూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యవసాయం ఎటు పోతుంది పట్టడు అన్నం పెట్టే రైతన్న ఏమి కావాలి వ్యవసాయ ఉత్పత్తు లు ఎలా ప్రజలకు అందాలి అన్న ప్రశ్నలు మేధావుల్లో తలెత్తుతున్నాయి. వ్యవసాయం ఉద్యోగముగా మారాలంటే ప్రభుత్వాలు రైతన్నకు చేయూతనిచ్చి రైతును రాజుగా మార్చే వైపు అడుగులు వేయాల్సి ఉంది. రైతే రాజు దేశానికి వెన్నెముక లాంటివాడు రైతు అంటూ ప్రభుత్వాలు అంటున్నాయే కానీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వాల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి అని తెలుస్తుంది. రైతు చెమటోడ్చి పండించిన పంటకు సరైన ధర దేవుడెరుగు కనీసం మద్దతు ధర కూడా లేదు. దీనికి తోడు తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలు తో రైతులు అప్పుల్లో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో దాదాపు వేరుశెనగ పంట తగ్గిపోయింది, ఎటు చూసినా బీడులుగా దర్శనమిస్తున్నాయి అతివృష్టి అనావృష్టి వల్ల పెట్టిన పెట్టుబడి చేతికందక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు బంగారు నగలు తాకట్టు పెట్టి కాడెద్దులు తెగ నమ్ముకొని దళారుల వద్ద అప్పులు చేసి అవస్థలు పడుతున్నారు. ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబాలు స్థానికంగా కూలి పనులు చేయలేక మనసు రాక పట్టణాలకు వలస వెళ్లి కూలి పనులు చేసు కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీలలో ఆర్బికేలు ద్వారా విత్తనాలు ఎరువులు పెట్టుబడి సాయం అందించేవారు. కూటమి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం క్రింద రూ 20 వేలు ఇస్తామని చెప్పిన మాటలను నిలబెట్టుకోవాలని ఇప్పటికే సిపిఐ పార్టీ తరఫున రైతు సంఘం నాయకులు నియోజక వర్గ వ్యాప్తంగా అధికారులకు వినతి పత్రాలు అందించడం జరిగినది. ఖరీఫ్ సీజన్ పూర్తి అవుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సహాయం అందకపోవడంతో పల్లెలు కాళీ అయిపోతాయేమో అనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఏ విధంగా రైతన్నలు బతికీడుస్తారో వేచి చూడాల్సిందే. రాబోయే కాలానికైనా రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక లాంటివాడు అవుతాడేమో వేచి చూద్దాం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు