Wednesday, April 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసి వై, టిబి చర్మ పరీక్షలను క్షేత్రస్థాయిలో నిర్వహించండి..

సి వై, టిబి చర్మ పరీక్షలను క్షేత్రస్థాయిలో నిర్వహించండి..

జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్. తిప్పయ్య
విశాలాంధ్ర ధర్మవరం : సి వై, టీబీ చర్మ పరీక్షలను క్షేత్రస్థాయిలో తప్పకుండా అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ తిప్పయ్య తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ శ్రేయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధి సంక్రమణ పరీక్ష సివై టివి చర్మ పరీక్ష పై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్షయ సోకిన రోగితోపాటు నివసించే వ్యక్తులకు చేయు పరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పరీక్ష గురించి ప్రజలకు పూర్తి దశలో అవగాహన కల్పించాలని వారు అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ఈ పరీక్షలు ప్రతి ప్రభుత్వ హెల్త్ సెంటర్ నందు ఉచితంగా వైద్య చికిత్సలను అందిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యమును పదిలంగా ఉంచుకోవాలని తెలిపారు. ఇప్పుడు జరిపిన పరీక్షల్లో సంక్రమణ నిర్ధారణ అయితే టీబీ జబ్బు రాకుండా ముందస్తుగా వాడే మందులతో నివారించవచ్చునని తెలిపారు. ఈ మందులు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ ప్రియాంక, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, టీబీ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు