విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణములోని మోటుమర్ల గ్రామంలో గల కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో ఆరవ తరగతికి ,ఇంటర్మీడియట్ ప్రవేశాల కొరకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఏ. చంద్రకళ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025-26 విద్యా సంవత్సరముకు గాను ప్రవేశాల కొరకు దరఖాస్తులను స్వీకరించడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఏప్రిల్ 11వ తేదీ వరకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలదని తెలిపారు. కావున అనాధలు, తల్లి లేక తండ్రి లేని వారు,బడి బయట పిల్లలు, బడి మానివేసిన వారు, ఎస్సీ, ఎస్టీ ,ఓబీసీ, మైనారిటీ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కలదని తెలిపారు. మైనారిటీ విద్యార్థులకు అధిక అవకాశం ఉందని, ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే ప్రవేశం కొరకు పరిగణలోకి తీసుకొనబడుతుందని తెలిపారు. ఎంపిక చేసిన విద్యార్థులు వివరాలు తల్లిదండ్రుల ఫోన్లకు రాష్ట్రము నుండి నేరుగా మెసేజ్ ద్వారా పంపబడుతుందని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థిని తోపాటు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డులు, విద్యార్థిని ఫోటో, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రము, చిరునామా తో కూడిన సెల్ నెంబర్ తప్పక ఆన్లైన్లో జతపరచాలన్నారు. ఈ అవకాశాన్ని అవకాశమున్నవారు తప్పక సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వివరాలకు మా పాఠశాలలో సంప్రదించవచ్చునని తెలిపారు.
కస్తూరిబా బాలికల పాఠశాల, కళాశాలకు ప్రవేశాల కొరకు దరఖాస్తులు చేసుకోండి
RELATED ARTICLES