యోగా గురువులు– కే. చంద్రశేఖర్, కే. భువనేశ్వరి
విశాలాంధ్ర ధర్మవరం;; నేటి సమాజంలో ప్రేరణతో కూడిన మాటలు అందరికీ ఎంతో ఉపయోగమని యోగా గురువులు కే. చంద్రశేఖర్ కే. భువనేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రేరణతో కూడినటువంటి మాటలు అనబడే వాటిపై తాము ఈనెల 4వ తేదీ నుండి ఆరవ తేదీ వరకు మూడు రోజులపాటు సికింద్రాబాద్ గ్రౌండ్ మినర్వా హోటల్ నందు”కార్పొరేట్ మోటివేషనల్ స్పీకర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్”అన్న అంశంపై శిక్షణను పొందడం జరిగిందన్నారు. ఈ శిక్షణలో ఎంతోమంది అనుభవజ్ఞులు ప్రేరణతో కూడినటువంటి పలు విషయాలను తెలియజేశారు. ధర్మవరం తరపున ఈ శిక్షణా తరగతులకు వెళ్లడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. మనం మాట్లాడే భాష ,దుస్తులు తదితర వాటిలో ప్రేరణ కలిగించే మాటలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. తాము ధర్మవరంలో సిద్దయ్యగుట్ట, జీవనజ్యోతి స్కూలు పక్కన గల నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో యోగా తరగతులను గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తూ మోటివేషన్ తరగతులు కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. మరింత అభివృద్ధి దిశలో అందరికీ ఉపయోగపడేలా ఈ శిక్షణ కోసం వెళ్లడం జరిగిందన్నారు. అక్కడ ప్రొజెక్టర్ ద్వారా పలు మోటివేషన్ తరగతుల యొక్క వివరణ ఇవ్వడం ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. తదుపరి ఈ శిక్షణ పూర్తి చేసుకున్న మాకు యోగా టీచర్, సినీ నటుడు ప్రదీప్, ఇంపాక్ట్ ఫౌండేషన్ గంప నాగేశ్వరరావు చేతుల మీదుగా సర్టిఫికెట్ తో పాటు ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు. త్వరలో పాఠశాలలలో, కళాశాలలలో, ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీస్ శాఖలకు కూడా ఈ మోటివేషన్ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.
ప్రేరణతో కూడిన మాటలు అందరికీ ఎంతో ఉపయోగం
RELATED ARTICLES